కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ మునుగోడులో ప్రచారాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్

  • మునుగోడులో ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీలు
  • గడప గడపకూ వెళ్తున్న శ్రీనివాస్ గౌడ్
  • మునుగోడును దత్తత తీసుకుంటానన్న కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్నీ గడప గడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా టీఆర్ఎస్ తరపున ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

 తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని... ఆయన సీఎం అయితే మునుగోడు అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి ప్రజలకు చెపుతున్నారు. తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ కాబోయే సీఎం అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

V Srinivas Goud
KTR
TRS
Munugode

More Telugu News